: ఎంసెట్‌-2 స్కాంలో కీల‌క అరెస్టులు.. సీఐడీ అదుపులో రాజ్‌వ‌ర్మ‌, సంజ‌య్‌కుమార్‌


తెలంగాణ ఎంసెట్-2 స్కాంలో సీఐడీ కీల‌క అరెస్టుల‌కు తెర‌తీసింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితులైన రాజ్‌వ‌ర్మ‌(44), సంజ‌య్ కుమార్ ప్ర‌భాత్‌(40)ల‌ను శుక్ర‌వారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఉండే రాజ్‌వ‌ర్మ బిహార్‌కు చెందిన‌వాడు. ఢిల్లీలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వ‌హిస్తున్నాడు. లీకైన తెలంగాణ ఎంసెంట్‌-2 ఎంట్ర‌న్స్ టెస్ట్ ప్ర‌శ్న ప‌త్రాల‌తో బెంగళూరులో మూడు క్యాంపులు ఏర్పాటు చేసిన రాజ్‌వ‌ర్మ 40 మంది విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్టు సీఐడీ ఐజీ సౌమ్య‌మిశ్ర తెలిపారు. అరెస్ట్ అయిన మ‌రో నిందితుడు ప్ర‌భాత్ ప్ర‌వృత్తి ప్ర‌శ్న‌పత్రాల‌ను లీక్ చేయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. సునీల్‌సింగ్ అలియాస్ క‌మ‌లేశ్ శ‌ర్మ అనే మ‌రో నిందితుడికి ప్ర‌భాత్ స‌హ‌చ‌రుడ‌ని, లీకైన రెండు సెట్ల ప్ర‌శ్న‌ప‌త్రాల‌తో షిరిడీలో క్యాంపు ఏర్పాటు చేసి 13 మంది విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చాడ‌ని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో సంజ‌య్ కుమార్ కీల‌క పాత్ర పోషించిన‌ట్టు తెలిపారు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి సంజ‌య్ రూ.30 ల‌క్ష‌లు వ‌సూలు చేసి సునీల్‌కు అందించిన‌ట్టు ద‌ర్యాప్తులో తేలింద‌ని మిశ్రా వివ‌రించారు.

  • Loading...

More Telugu News