: శబరిమలకు 98 ప్రత్యేక రైళ్లు.. రేపటి నుంచి రిజర్వేషన్లు
శబరిమల భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణమధ్య రైల్వే 98 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లలో రేపటి నుంచే భక్తులకు రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్, నిజామాబాద్, కాకినాడ, నర్సాపూర్, విజయవాడ, మచిలీపట్నం, సిర్పూర్ కాగజ్నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, అకోలా, తిరుపతి, ఆదిలాబాద్, కొల్లాం నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. శబరిమల వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో తిరుపతిని కూడా దర్శించుకుంటారు కాబట్టి వారి కోసం తిరుపతి-అకోలా, తిరుపతి-ఆదిలాబాద్ మధ్య వచ్చే నెల 6వ తేదీ నుంచి జనవరి 18 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు ఆదివారం నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. రైళ్ల షెడ్యూల్ కోసం దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లో కానీ ఎంక్వైరీ నంబరుకు ఫోన్ చేసి కానీ తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు.