: బీజేపీ నేతలు తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారు: మల్లికార్జున ఖర్గే


పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని నెలల కిందటే లీక్ చేశారని, దీంతో, బీజేపీ నేతలు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ రోజు ఆయన పార్లమెంట్ భవనం వద్ద మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలు తమ వద్ద ఉన్న నల్లధనంతో ఆస్తులు కొనుగోలు చేసుకున్నారని ఆరోపించారు. ప్రధానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే పార్లమెంట్ సమావేశాలకు వచ్చి చర్చలో పాల్గొనాలని, పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాల ప్రశ్నలకు మోదీ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News