: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ చేయకూడని పని చేశాడా?
బాలీవుడ్ లో దూసుకుపోతున్న యంగ్ హీరో రణవీర్ సింగ్ కు యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం తన తాజా చిత్రం 'బేఫికర్' ప్రమోషన్ కార్యక్రమాల్లో రణవీర్ బిజీగా ఉన్నాడు. బుధవారంనాడు సినిమాలోని ఓ పాటను ఫ్రాన్స్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సినిమాలో తన సహనటి వాణి కపూర్ తో కలసి సంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్ చేశాడు రణవీర్. అంతేకాదు, సరదాగా డ్యాన్స్ కూడా చేశాడు. ఈ సందర్భంగా రణవీర్ ను ఆయన అభిమానులు 'మీరు ఇండియాలో చేసిన బేఫికర్ పనేంటి?' అని అడిగారు. దీనికి సమాధానంగా... అది చెబితే నేను కచ్చితంగా అరెస్టై జైల్లో ఉంటానని సమాధానం ఇచ్చాడు. కానీ, ఏం పని ఏం చేశాడో మాత్రం రణవీర్ చెప్పలేదు. దీంతో, రణవీర్ అంత చేయకూడని పని చేశాడా? అంటూ అతని అభిమానులు ఆలోచనలో పడ్డారు. రణవీర్ నటించిన 'బేఫికర్' డిసెంబర్ 9న రిలీజ్ కానుంది.