: ఒక వైపు తమ మధ్య ఏమీ లేదంటుంది... ఇప్పుడేమో ఇద్దరూ కలసి ఉండబోతున్నారు!
బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్, అందాల నటి శ్రద్ధా కపూర్ ల గురించి బీటౌన్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని... శ్రద్ధ కారణంగానే తన భార్యకు ఫర్హాన్ విడాకులు ఇచ్చాడనేది పెద్ద టాక్. అయితే, ఈ రూమర్స్ ని శ్రద్ధ ఖండించింది. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటన వీరి మధ్య బలమైన బంధమే ఉందని చెబుతోంది. శ్రద్ధ నటించిన బాఘీ చిత్రం హిట్ కావడంతో... ఆమె ముంబైలోని బాలీవుడ్ సెలబ్రిటీలను సక్సెస్ పార్టీకి ఆహ్వానించింది. దీనికి ఫర్హాన్ కూడా హాజరయ్యాడు. అంతేకాదు, శ్రద్ధ తల్లిదండ్రులు కూడా వచ్చారు. వారు ఉన్నంత వరకు బాగానే ఉంది... వారు వెళ్లిపోయిన తర్వాత మాత్రం శ్రద్ధ రెచ్చిపోయిందట. ఫర్హాన్ తో కలసి అందరిముందే పరిధులు దాటి చిందులు వేసిందట. అంతేకాదు, వీలు దొరికినప్పుడల్లా ఫర్హాన్ తో కలిసి ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతోందట. మరో విషయం ఏమిటంటే... ముంబైలోని కాస్ట్ లీ ఏరియా బాంద్రాలో ఫర్హాన్ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో శ్రద్ధ, ఫర్హాన్ లు కలసి ఉండబోతున్నారనేది బీటౌన్ టాక్. దీనికి తోడు, ఫర్హాన్ నిర్మాతగా తీయబోతున్న కొత్త సినిమాలో శ్రద్ధానే హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడట. ఇంత జరుగుతున్నా... ఫర్హాన్ కు, తనకు మధ్య ఏమీ లేదని శ్రద్ధ చెబుతుండటం విచిత్రంగానే ఉంది.