: ఏటీఎం క్యూ లైన్లలోని వారికి మ్యాంగో డ్రింక్ లు ఇచ్చిన వైఎస్సార్సీపీ


పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి కొత్త నోట్లు, చిన్న నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరని రోజు లేదు. గంటల తరబడి నిలబడితే కొద్దో గొప్పో నగదుతో బయటకు వస్తున్న ఖాతాదారులు కొందరైతే, ఒట్టి చేతులతో వెనుతిరుగుతున్న వారు మరికొందరు. గొంతు ఎండుతున్నా క్యూ లైన్ల నుంచి కదలలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. హైదరాబాద్ చైతన్యపురిలోని ఏటీఎంల వద్ద ఈరోజూ అదే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో క్యూ లైన్లలో ఉన్నవారికి వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ మ్యాంగో డ్రింక్ ఫ్రూటీలను అందజేశారు. కరెన్సీ కోసం వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News