: తిండీతిప్పలు మానేసి వ్యసనాలకు బానిసవుతున్న హాలీవుడ్ నటి
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీల వివాహబంధం తెగిపోయిన సంగతి తెలిసిందే. బ్రాడ్ పిట్ తో బంధం బద్దలవడంతో జోలీ తీవ్ర వేదనకు గురవుతోంది. తిండీతిప్పలు కూడా మానేసి, వ్యసనాలకు బానిస అవుతోంది. ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లను ఊదేస్తోంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఓ వెబ్ సైట్ తెలిపింది. తీవ్ర ఒత్తిడిలోనే జోలీ ఇలా తయారయిందని ఆమె స్నేహితులు కూడా చెబుతున్నారు. క్యాన్సర్ బారిన పడ్డ జోలీ ఇప్పటికే సర్జరీలు చేయించుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఆమె ఈ స్థాయిలో సిగరెట్లు తాగుతుండటాన్ని నమ్మలేకపోతున్నామని అంటున్నారు.