: హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోదీ
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిపోర్టులో మోదీకి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి మోదీ జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లనున్నారు. రేపు డీజీపీల సమావేశంలో ఆయన ప్రసంగం ఉంటుంది. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.