: ప్రధాని మోదీ అభ్యంతరకర ఫొటోను సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తి అరెస్టు


ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరకర ఫొటోను సామాజిక మాధ్యమల ద్వారా సర్క్యులేట్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరెనాలోని బాన్మోర్ టౌన్ లో మొబైల్ షాపు నిర్వహిస్తున్న ఇరవై ఐదు సంవత్సరాల అస్లామ్ ఖాన్ నిన్న రాత్రి ప్రధాని అభ్యంతరకర ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా సర్క్యులేట్ చేస్తుండగా అరెస్టు చేశామని బాన్మోర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆత్మారాం శర్మ పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ఫొటో వైరల్ కావడంపై బాన్మోర్ బీజేపీ అధ్యక్షుడు రాంబారన్ మావై ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు.

  • Loading...

More Telugu News