: హాంకాంగ్ సూప‌ర్ సిరీస్‌ క్వార్ట‌ర్ ఫైనల్లో నిరాశ పరిచిన సైనా నెహ్వాల్


హాంకాంగ్ సూప‌ర్ సిరీస్‌లో క్వార్ట‌ర్ ఫైనల్ లోకి ప్రవేశించిన భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, హైదరాబాదీ సైనా నెహ్వాల్ అభిమానులను నిరాశపర్చింది. కార్టర్ ఫైనల్లో ఈ రోజు హాంకాంగ్‌ క్రీడాకారిణి చెంగ్‌ యి తో త‌ల‌ప‌డిన సైనా 8-21, 21-18, 19-21 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో సైనా విజ‌యం సాధిస్తే, ఇప్ప‌టికే సెమీస్‌లో అడుగుపెట్టిన తెలుగుతేజం సింధుతో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని, ఆ పోరును చూడాల‌ని భార‌త అభిమానులు ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రిచిన విష‌యం తెలిసిందే. మరోవైపు సెమీస్ కు చేరిన పీవీ సింధు చైనా క్రీడాకారిణి చెంగ్‌ యి తో తలపడనుంది.

  • Loading...

More Telugu News