: ఆ బస్సులో 220 కిలోల బరువున్న 120 తాచుపాములు!
వియత్నాం రాజధాని హనోయ్ లో 220 కిలోల బరువు ఉన్న 120 తాచుపాములను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విన్ పుక్ ప్రావిన్స్ నుంచి హో కి మిన్ నగరానికి వెళుతున్న ఒక బస్సులో డ్రైవర్, నలుగురు వ్యక్తులు ఉన్నారు. అనుమానం వచ్చిన పోలీసులు ఈ బస్సును తనిఖీ చేయగా.. వేర్వేరు ప్లాసిక్ డబ్బాల్లో 120 తాచుపాములు ఉండటాన్ని గుర్తించారు. దీంతో, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడటాన్ని నేరంగా పరిగణిస్తామని, ఈ విషయమై ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.