: రద్దయిన పెద్ద నోట్లు తన వద్ద భారీగా వుండంతో మనస్తాపం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య!
రద్దయిన పెద్దనోట్లు తన వద్ద ఎక్కువ సంఖ్యలో ఉండటంతో మనస్తాపం చెందిన రిటైర్డు బ్యాంకు క్యాషియర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సోనర్ ప్రాంతంలో జరిగింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) లో క్యాషియర్ గా చేస్తూ వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్న ఆనంద ముకుట్ బాపత్ (58) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాట్లాడుతూ, రద్దయిన పెద్దనోట్లు ఆయన వద్ద ఎక్కువగా ఉన్నాయనే విషయం సంఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా తెలిసిందని, బాపత్ సొంత వ్యాపారం కూడా ఇటీవల ప్రారంభించాడని పోలీసులు చెప్పారు.