: ‘10 వేల సీట్లకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కోల్పోతాం’... నీట్‌పై విద్యార్థిని సుప్రీంలో పిటిషన్
నీట్ పీజీ పరీక్షల్లో ఆలిండియా కోటాలో 50 శాతం సీట్లకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం లేదంటూ విడుదలైన నోటిఫికేషన్‌పై శ్రావ్య అనే విద్యార్థిని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నిర్ణయంతో తమకు ఎంతో నష్టం జరుగుతుందని 10 వేల సీట్లకు దరఖాస్తు అవకాశం కోల్పోతామని ఆమె పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ఆమె తరఫు న్యాయవాది వాదిస్తూ కొత్త నోటిఫికేషన్ ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లేనని తెలిపారు. వాదన విన్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఎంసీఐ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పలు నోటీసులు జారీ చేసి, పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.