: క్రష్ సెంటర్లలో పిల్లల్ని వదిలే తల్లిదండ్రులకి హెచ్చరిక... ఏడుస్తోందని చిన్నారిని నేలకేసి కొట్టారు!


భార్తాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలను చూసుకోవడం చాలా సమస్యగా మారింది. పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ ఉండరు. కుటుంబ పెద్దలేమో స్వగ్రామాల్లో ఉంటారు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని క్రష్ సెంటర్లలో వదిలేసి పోవడం తల్లిదండ్రులకు తప్పని పరిస్థితిగా మారింది. అయితే, క్రష్ సెంటర్లలో పిల్లలు పడుతున్న వ్యథ బయటకు ఎక్కువగా రావడం లేదు. వాళ్లు పడుతున్న భాధను తల్లిదండ్రులతో పంచుకునేంత పరిణితి పిల్లల్లో ఉండదు. తాజాగా ఓ క్రష్ సెంటర్లో జరిగిన ఉదంతం వింటే ఎవరికైనా బాధ కలుగక మానదు. రుచితా సిన్హా, రజత్ సిన్హా అనే దంపతులు తమ పాపను ప్రతి రోజు ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో క్రష్ సెంటర్లో వదిలివెళ్లి, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకువస్తుంటారు. సాయత్రం తీసుకువచ్చేటప్పుడు పాప నుదురు మీద ఉన్న గాయాన్ని చూసి, క్రష్ మేనేజ్ మెంట్ ను ప్రశ్నించగా వారి వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు. ఆ తర్వాత పాపను డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా, పాపను గట్టగా కొట్టి ఉంటారని ఆయన చెప్పారు. దీంతో, క్రష్ సెంటర్ కు వచ్చి సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత వారు షాక్ అయ్యారు. కొంత మంది పిల్లలు పడుకుని నిద్రపోతుండగా... సిన్హా దంపతుల పాప ఏడుస్తుండటంతో... ఆమెను క్రష్ సెంటర్ సిబ్బంది బాగా కొట్టడం, నేలకేసి బాదడం సీసీటీవీలో కనిపించింది. దీంతో, కేర్ టేకర్ తో పాటు, క్రష్ యజమానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే స్పందిస్తూ, ఈ ఘటన చాలా షాకింగ్ గా ఉందని తెలిపారు. అన్ని ప్లే స్కూళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు, కేర్ టేకర్ అఫ్సానాకు పోలీస్ కస్టడీ విధించగా... యజమాని ప్రియాంకా నిగమ్ మాత్రం బెయిల్ పై బయటకు వచ్చింది.

  • Loading...

More Telugu News