: గాయాలతో బాధపడుతున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే లొంగిపోవాలి: మల్కన్ గిరి ఎస్పీ


కాళ్లకు గాయాలతో బాధపడుతున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే లొంగిపోయి, సరైన వైద్యం చేయించుకోవాలని ఒడిశా పోలీసులు కోరారు. ఏవోబీలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ఆర్కే కాళ్లకు గాయాలయ్యాయని మల్కన్ గిరి ఎస్పీ మిత్ర భాను మహాపాత్ర తెలిపారు. ఆరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో చాకచక్యంగా తప్పించుకున్న ఆర్కే ఏవోబీలోని గుర్తుతెలియని వైద్యశిబిరంలో చికిత్స పొందుతున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. ఆర్కే గాయాలకు నాటువైద్యం చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని మహాపాత్ర పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఒడిశా, ఏపీ రాష్ట్రాలలోని ఆసుపత్రులకు ఆర్కే వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News