: ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు
విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి క్యాంపు కార్యాలయానికి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కొద్ది సేపటి క్రితం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో భేటీ అయి పలు అంశాలపై చర్చించిన ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబుతో తమ తమ నియోజక వర్గాల అభివృద్ధి, అందాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.