: రద్దైన నోట్ల ప్రభావం: రికార్డు స్థాయిలో జీహెచ్‌ఎంసీ ఆదాయం


పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత ర‌ద్దైన నోట్ల‌తో ప‌న్నులు చెల్లించ‌వచ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో ఇన్నాళ్లూ ట్యాక్స్ చెల్లించ‌కుండా కాలం గ‌డిపిన ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా జీహెచ్ఎంసీ కార్యాల‌యానికి క్యూక‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జీహెచ్ఎంసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వ‌చ్చి ప‌డుతోంది. పదిరోజుల్లో రూ.242 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు సంబంధిత‌ అధికారులు ఈ రోజు మీడియాకు తెలిపారు. పాతనోట్లతో చెల్లింపులకు చివరి రోజైన నిన్న జీహెచ్‌ఎంసీకి రూ.22.14 కోట్లు వచ్చాయని చెప్పారు. అంతేగాక, వాటర్‌బోర్డుకు మొత్తం రూ.101.23 కోట్లు రాగా, నిన్న ఒక్కరోజే 3.11 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News