: చోరకళ.. బ్యాంకులో 1.22 కోట్ల రూపాయ‌ల పాతనోట్లను చోరీ చేసిన దొంగలు


బ్యాంకుల వ‌ద్ద‌ ఖాతాదారుల తాకిడి అధికంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అధిక సంఖ్య‌లో పాత‌నోట్లు బ్యాంకుల్లోకి వ‌చ్చిప‌డుతున్నాయి. బ్యాంకు సిబ్బంది త‌మ ప‌నిలో తాము బిజీబిజీగా ఉంటే దొంగ‌ల ముఠాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాయి. హరియాణా, హిసార్ జిల్లా ఖార్ ఖోడాలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో ఓ దొంగల ముఠా, ఖాతాదారులు డిపాజిట్ చేసిన ర‌ద్దైన 500, 1000 రూపాయ‌ల నోట్లను చోరీ చేశారు. నిన్న ఉద‌యం బ్యాంకు తెరిచిన అధికారులు బ్యాంకు నుంచి సుమారు 1.22 కోట్ల రూపాయ‌లు మాయ‌మ‌యిన‌ట్లు గ‌మ‌నించారు. వెంట‌నే చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు వెనకవైపు ఉన్న‌ గోడకు కన్నం వేసిన దొంగ‌లు ఈ చోరీకి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు గుర్తించారు. దొంగ‌లు చోరీ చేసిన న‌గ‌దులో కొత్త కరెన్సీ కూడా సుమారు రూ 30,000 వున్నట్టు తెలుస్తోంది. ముఖాల‌కు మాస్కులు ధ‌రించి బ్యాంకులోకి ప్ర‌వేశించిన దొంగ‌లు మొద‌ట అక్క‌డి సీసీటీవీలను ధ్వంసం చేసి అనంత‌రం చోరీకి పాల్ప‌డ్డారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దొంగ‌ల‌ముఠా కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News