: ఏటీఎం క్యూ లో నిలబడ్డ వృద్ధురాలు గుండెపోటుతో మృతి


మూడు గంటల పాటు ఏటీఎం క్యూ లో నిలబడ్డ డెబ్భై సంవత్సరాల వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. యూపీలోని బల్లియా సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం వద్ద ఇంద్రసాని దేవి (70) అనే వృద్ధురాలు నిన్న క్యూ లో నిలబడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఇంద్రసాని దేవి కుటుంబసభ్యులు చెప్పారు. మరో బాధాకరమైన విషయమేమిటంటే, వృద్ధురాలి అంత్యక్రియలను నిర్వహించేందుకు ఆమె కుటుంబసభ్యుల దగ్గర నగదు లేదు. దీంతో, ఏ ఏటీఎం వద్ద అయితే ఆమె అస్వస్థతకు గురైందో అదే ఏటీఎం వద్ద ఇంద్రసాని కుటుంబసభ్యులు డబ్బు విత్ డ్రా కోసం నిలబడ్డారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ వైభవ్ కృష్ణ మాట్లాడుతూ, విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News