: ఢిల్లీలో బాణసంచాపై నిషేధం విధించిన సుప్రీంకోర్టు
ఢిల్లీలో బాణసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమ్మకందారుల లైసెన్స్ లు రద్దు చేయాలని, ప్రస్తుతానికి కొత్త లైసెన్స్ లు జారీ చేయవద్దని, బాణసంచావల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, ఇప్పటికే ఢిల్లీ కాలుష్య కాసారంగా మారింది. విషవాయువుల ప్రభావం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది.