: కుల్గామ్ జిల్లాలో పోలీసులపై ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు పోలీసుల మృతి
భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లోకి తరచూ చొరబడుతున్న ఉగ్రవాదులు సైనికులతో పాటు పోలీసులపై దాడులకు దిగుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో పోలీసులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు వీరమరణం పొందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు సైన్యం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.