: ఏ నోట్లూ వద్దు, వస్తువు తీసుకెళ్లండి చాలు... అమ్మకాల కోసం గృహోపకరణాల షాపుల తంటాలు!


రోజుకు లక్షల్లో వ్యాపారం జరిగే షాపుల్లో వేలల్లో కూడా వ్యాపారం సాగని వేళ, గృహోపకరణాల రిటైల్ సంస్థలు అమ్మకాలను నిలుపుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. "మీకు ఎల్ఈడీ టీవీ కావాలా? ఫ్రిజ్ కావాలా? ఏసీ కావాలా? ఏదైనా సరే. ఇప్పుడు డబ్బివ్వద్దు. కొత్త నోట్లు వద్దు, పాత నోట్లు వద్దు. వస్తువు తీసుకెళ్లండి. రెండు నెలల తరువాత డబ్బివ్వండి. అది కూడా వడ్డీ రహిత సులభ వాయిదా పద్ధతిలోనే" అని ప్రచారం చేస్తున్నాయి. రెండు నెలల 'పేమెంట్ హాలిడే'ను ఇప్పుడు అన్ని ప్రముఖ కన్స్యూమర్ గూడ్స్ సంస్థలు అందిస్తున్నాయి. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకే చిల్లర లభించని పరిస్థితుల్లో లగ్జరీ వస్తువులు, గృహోపకరణాల గురించి ఎవరూ ఆలోచించక పోవడంతో తాము భారీగా నష్టపోతామని భావిస్తున్న రిటైల్ స్టోర్ యజమానులు ఈ రూట్లో అమ్మకాలను నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికి డబ్బు రాకపోయినా, వ్యాపారం సాగుతుందన్న ఆలోచనతో పాత కస్టమర్లకు నచ్చిన వస్తువులను తీసుకు వెళ్లాలని ప్రత్యేక మెసేజ్ లను పంపుతున్నారు.

  • Loading...

More Telugu News