: రాజ్యసభ ప్రారంభం...వాయిదా


పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేటి ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్ లైబ్రరీకి వచ్చిన ప్రధానికి నాలుగడుగులు పడలేదా? పార్లమెంటు అంటే అంత నిర్లక్ష్యమా? అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటుకు వస్తేనే చర్చ జరుగుతుందని, లేని పక్షంలో సభ నిర్వహించడంలో అర్థం లేదని పేర్కొంటూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో విపక్షాలను సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ మళ్లీ కోరారు. విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News