: మరింత తగ్గిన బంగారం, రూ. 40 వేల దిగువన వెండి
ప్రపంచ మార్కెట్ల నుంచి వీస్తున్న పవనాలు వ్యతిరేకంగా ఉండటంతో బంగారం, వెండి ధరలు మరింతగా తగ్గాయి. ఈ ఉదయం బులియన్ మార్కెట్లో 11:30 గంటల సమయంలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం (డిసెంబర్ 5 డెలివరీ) ధర క్రితం ముగింపుతో పోలిస్తే, రూ. 311 తగ్గి 1.08 శాతం తగ్గి రూ. 28,435 వద్ద కొనసాగుతుండగా, వెండి ధర కిలోకు రూ. 257 తగ్గి రూ. 39,991 వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్ తో రూపాయి మారకపు విలువ 27 పైసలు పుంజుకుని రూ. 68.64కు చేరింది. ఇండియాలో బంగారం అమ్మకాలు తగ్గడంతో ట్రేడర్లు, స్టాకిస్టులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.