: ప్రయాణికుల ప్రాణాలు పణం... మద్యం సేవించి చిక్కిన 151 మంది విమాన సిబ్బంది: అశోక్ గజపతి రాజు
విమానాల్లో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలనే పణంగా పెట్టేలా ఇండియాలో 38 మంది పైలెట్లు సహా 151 మంది విమాన సిబ్బంది మద్యం సేవించి విధులకు వచ్చి అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయాన్ని పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. జనవరి నుంచి అక్టోబర్ వరకూ నిర్వహించిన పరీక్షల వివరాలను వెల్లడించిన ఆయన, విమాన ప్రయాణానికి ముందు విధిగా నిర్వహించే శ్వాస పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. వీరిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనర్హత వేటు వేసిందని తెలిపారు. ఇక విమానయాన సంస్థలు క్రమశిక్షణా నిబంధనలు మీరిన ఘటనలను 15 గుర్తించామని, ఈ సంస్థలపైనా చర్యలు తీసుకున్నామని తెలిపారు.