: అతనితో నా సంబంధాన్ని అపార్థం చేసుకుంటున్నారు: మలైకా అరోరా
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని... అంతకు మించి తమ మధ్య మరేం లేదని నటి మలైకా అరోరా స్పష్టం చేసింది. తమ మధ్య సంబంధాన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారని చెప్పింది. తనకు, అర్జున్ కపూర్ కు మధ్య రిలేషన్ షిప్ నడుస్తోందనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఆమె ఈ విధంగా స్పందించింది. తన భర్త అర్భాజ్ ఖాన్ (సల్మాన్ ఖాన్ సోదరుడు)కు మలైకా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకుల కోసం కూడా ఫైల్ చేశారు. మలైకా, తాను విడిపోయామని గతంలో అర్భాజ్ ప్రకటించిన సమయంలో... తామిద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేదని ఇన్ డైరెక్ట్ గా అర్జున్ ను ఉద్దేశిస్తూ అర్భాజ్ అన్నాడు. గతంలో దర్శకుడు నికిల్ అద్వానీ వద్ద అసిస్టెంట్ గా చేస్తున్న సమయంలో, సల్మాన్ ముద్దుల చెల్లెలు అర్పితతో కూడా రెండేళ్ల పాటు అర్జున్ కపూర్ ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఆయుష్ శర్మను అర్పిత పెళ్లి చేసుకుంది.