: తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు...విశాఖ మన్యాన్ని వణికిస్తున్న చలిపులి


తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ప్రధానంగా విశాఖ ఏజెన్సీని చలిపులి వణికిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. దీంతో లంబసింగి, చింతపల్లిలో 6 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, అరకుల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇతర చోట్ల కనీసం పది డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావడం లేదు. దీంతో మన్యం వాసులు గజగజవణికిపోతున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా సాధారణం కంటే, నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

  • Loading...

More Telugu News