: కొత్త డిపాజిట్ స్కీమును ప్రకటించనున్న మోదీ
పెద్ద నోట్ల రద్దు తరువాత ఇండియాలో కరెన్సీ ఎమర్జెన్సీ ఏర్పడటం, బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజల ఇబ్బందులు, విపక్షాల విమర్శలతో పార్లమెంటులో కార్యకలాపాల స్తంభన.. తదితరాల నేపథ్యంలో నిన్న రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఓ కొత్త క్యాష్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్ ను ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎక్కువ డబ్బు కలిగివున్నవారికి 200 శాతం జరిమానా విధించాలని గతంలో తీసుకున్న నిర్ణయం సరికాదని, వీరిపై జరిమానా తగ్గించాలని కొందరు మంత్రులు చేసిన సూచనలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ తిరిగి దేశంలో కొనసాగినప్పుడే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని అభిప్రాయపడ్డ మోదీ, రూ. 1000 నోట్లు సామాన్యుల వద్ద లేవని, ఒకవేళ ఉన్నా, వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పారు.