: అక్రమార్కులకు సహకరిస్తే సస్పెండ్ కాదు, డిస్మిస్సే: కఠినంగా హెచ్చరించిన అరుంధతీ భట్టాచార్య


పాత కరెన్సీని మార్చేందుకు సహకరించే బ్యాంకు ఉద్యోగులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌ పర్సన్ అరుంధతీ భట్టాచార్య హెచ్చరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించి, అక్రమార్కులకు సహకరిస్తే డిస్మిస్ చేస్తామని అన్నారు. పట్టుబడిన ఉద్యోగిపై విచారణలో నేరం రుజువైతే శాశ్వతంగా ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని అన్నారు. ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలలో 65 శాతం వరకూ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ఖాతాదారులకు సేవలు సైతం సంతృప్తికరంగానే సాగుతున్నాయని అన్నారు. ఖాతాదారులు డబ్బు డిపాజిట్ కోసం బ్యాంకు వరకూ రాకుండా పాయింట్ ఆఫ్ సేల్స్ వాహనాలను జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంచామని, ఇక్కడ డెబిట్ కార్డులను వాడుకుంటూ రూ. 2 వేల వరకూ పొందవచ్చని వివరించారు. వీటికి అదనంగా మొబైల్ ఏటీఎంలను సైతం నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News