: రష్యాలో టీవీ షో రచ్చ... పోలండ్ జర్నలిస్టు, ఉక్రెయిన్ వాసి ముష్టిఘాతాలు
రష్యాలో ఓ టీవీ ఛానెల్ కోసం షూట్ చేసిన చర్చ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. ముష్టిఘాతాలతో ముగిసింది. టీవీలో ఇంకా ప్రసారం కాని ఆ చర్చా కార్యక్రమంలో జరిగిన ఈ ముష్టిఘాత యుద్ధాన్ని మొబైల్ ద్వారా షూట్ చేసిన వ్యక్తి దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ఓటింగ్ రైట్ పేరుతో రష్యాలో ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న పోలండ్ జర్నలిస్టు మాట్లాడుతూ, రష్యాలో వేతనాలు చాలా ఘోరంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ పౌరులు ఇంతకంటే మెరుగైన జీవనం సాగించాలని చూస్తున్నారని తెలిపాడు. దీంతో గెస్టుగా పాల్గొన్న రష్యా వ్యక్తి పోలండ్ జర్నలిస్టుపై యుద్ధానికి దిగాడు. అక్కడి వారు అడ్డుకుంటున్నా దూసుకెళ్లి అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో జర్నలిస్టు ముక్కు పచ్చడైంది. ఆ వీడియోను మీరు కూడా చూడవచ్చు.