: ఫైనాన్షియర్ల వేధింపుల నేపథ్యంలో.. వైజాగ్ లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
విశాఖపట్టణంలోని అల్లిపురంలోని ఓ లాడ్జిలో నడి వయసు దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. మృతి చెందిన దంపతులు విజయగోపాల్ (50), నాగలక్ష్మి (48) అనకాపల్లికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తమ ఆత్మహత్యకు ఫైనాన్షియర్లు ఆదిబాబు, నాయుడుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, మృతుల బంధువులకు ఫోన్ చేసి విషయం వివరించారు. దీంతో అనకాపల్లిలో విషాదం అలముకుంది. నిందితులైన ఫైనాన్షియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బంధువులు, వారి మృతదేహాలను అనకాపల్లి తీసుకెళ్లారు.