: బీజేపీ ముఖ్యమంత్రిని అడిగినా ఇది తుగ్లక్ నిర్ణయమని అంటారు: మమతా బెనర్జీ


బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రినైనా, 'ఆఫ్ ది రికార్డ్'గా నోట్ల రద్దుపై మీ అభిప్రాయం ఏమిటి? అంటే, 'నోట్ల రద్దు నిర్ణయం తుగ్లక్ నిర్ణయ'మని అంటారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చమత్కరించారు. నోట్ల రద్దుపై ఆమె మాట్లాడుతూ, ఇది పిచ్చి తుగ్లక్ నిర్ణయమని అన్నారు. నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీ లూటీ జరుగుతోందని అన్నారు. చెమటోడ్చి సంపాదించిన డబ్బును ప్రభుత్వం తీసుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు. ట్యాక్సులు తీసుకుంటున్న ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టాల్సిన విధానం ఇది కాదని ఆమె చెప్పారు. అందుకే తాము ఆందోళనను ఉద్యమం రూపంలో తీసుకెళ్తున్నామని అన్నారు. సమస్యను అర్థం చేసుకున్నవారంతా తమతో కలిసి వస్తారని ఆమె చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రధాని చెబుతున్నట్టు ఎవరూ సంతోషంగా లేరని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News