: పెద్దనోట్ల రద్దు జాతీయ విపత్తుకు దారితీసేలా ఉంది: రతన్ టాటా


పెద్దనోట్ల రద్దు జాతీయ విపత్తుకు దారి తీసేలా ఉందని ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ముఖ్యంగా, వైద్యపరమైన అవసరాలకు సరైన సమయంలో వారికి డబ్బులు అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో ఆయన కోరారు.

  • Loading...

More Telugu News