: నిప్పు రాజుకోవడంతో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్


ఎయిరిండియా విమానాన్ని అధికారులు అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737-800 విమానం మంగళూరు సమీపానికి వచ్చేసరికి విమానం అడుగు భాగంలో నిప్పు రాజుకోవడాన్ని పైలట్ గుర్తించారు. దీంతో హుటాహుటీన ఎయిర్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించడంతో కోచి వద్ద విమానాన్ని ల్యాండ్ చేయాలని సూచించారు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కోచి ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం చేరుకునే సరికి సిద్ధంగా ఉన్న అగ్నిమాపక శకటాలు విమానాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని, విమానంలోని 131 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News