: గుజరాత్ సీఎంపై ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలి: సురవరం డిమాండ్
గుజరాత్ సీఎంకు సహారా ద్వారా రూ.40 కోట్లు, బిర్లా ద్వారా రూ.15 కోట్లు చేరినట్లు సుప్రీంకోర్టులో చర్చ జరుగుతోందని, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, జీడీపీ వృద్ధి రేటు 3.5కి పడిపోయిందని అన్నారు. రద్దయిన నోట్లు కొంతకాలం చెల్లుబాటు అయ్యేలా వెసులుబాటు కల్పించాలని, ప్రతిపక్షాలు సభ జరగనివ్వడం లేదనడం అవాస్తవమని అన్నారు. 'సభకు మోదీ ఎందుకు హాజరవ్వడం లేదో చెప్పాలి' అని సురవరం డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుపై ఈ నెల 30 వరకు నిరసనలు, 28వ తేదీన బంద్ నిర్వహిస్తామని చెప్పారు.