: భారత్ లా కాదు...పాక్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపితే భారత్ లో తరతరాలు గుర్తుంచుకుంటాయి!: పాక్ సైన్యాధ్యక్షుడు రహీల్ షరీఫ్


పాక్ సైన్యాధ్యక్షుడు రహీల్ షరీఫ్ భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. ఈ నెల 29 నుంచి పదవీకాలం ముగియనుండడంతో ఖైబర్ ప్రాంతంలో ఓ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ, భారత్ పై పాక్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపితే భారత్ లోని తరతరాలు గుర్తించుకుంటాయని అన్నారు. సంయమనం పాటిస్తున్నా భారత్ దాడులకు పాల్పడితే తిప్పికొట్టగలమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పాక్ ఎయిర్ చీఫ్ మార్షల్ సొహైల్ అమన్ మాట్లాడుతూ, కశ్మీర్ విషయంలో భారత వైఖరి రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారుతోందని అన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ మహ్మద్ జకవుల్లా మాట్లాడుతూ, పాక్ ప్రాదేశిక జలాల్లోకి భారత్ పదేపదే చొచ్చుకొచ్చి రెచ్చగొడుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News