: కొత్త, పాత నోట్లను పోల్చి చూసిన పవన్ కల్యాణ్
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ కొత్త, పాత నోట్లను పోల్చి చూశారు. రెండు వేల రూపాయల నోటును, వంద రూపాయల నోటును చాలా శ్రద్ధగా పరిశీలించారు. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్, విరామ సమయంలో ఆ నోట్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.