: ఏటీఎంలో పాము.. అక్కడికి వెళ్లే ధైర్యం ఎవరూ చేయడం లేదు!


దేశ వ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు కోసం ఖాతాదారులు బారులు తీరుతున్న విషయం తెలిసిందే. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఏటీఎంలో కొత్త నోట్లు ఉన్నప్పటికీ ఖాతాదారులెవ్వరూ నగదు తీసుకునే ప్రయత్నాలు చేయట్లేదు. ఎందుకంటే, ఆ ఏటీఎంలోకి ఈరోజు మధ్యాహ్నం ఒక కట్లపాము ప్రవేశించడంతో దాని దరిదాపులకు వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. ఈ సమాచారం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది, పామును బయటకు పంపించే ప్రయత్నాలు చేశారు.

  • Loading...

More Telugu News