: సీబీఐ మెరుపుదాడుల్లో వెలుగులోకి వ‌స్తోన్న నిజాలు.. రూ.40ల‌క్ష‌లు మార్చారని అనుమానం


హైద‌రాబాద్‌లోని పోస్టాఫీసుల్లో పెద్దనోట్ల మార్పిడి విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు న‌గ‌రంలోని ప‌లు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు దాడుల‌కు దిగిన విష‌యం తెలిసిందే. అబిడ్స్‌, హియాయత్ న‌గ‌ర్‌తో పాటు ప‌లు పోస్టాఫీసుల్లో వారి త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. అయితే, హిమాయత్ నగర్ పోస్టాఫీసులో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని అధికారులు గుర్తించారు. సుమారు 40 లక్ష‌ల రూపాయ‌లను ఈ పోస్టాఫీసులో అక్ర‌మంగా మార్చార‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. వాటి లెక్క‌ల‌పై ఆరాతీస్తున్నారు. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News