: హైదరాబాద్ లోని పోస్టాఫీసులపై సీబీఐ మెరుపుదాడులు

పెద్దనోట్ల మార్పిడి విషయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు పోస్టాఫీసులపై సీబీఐ మెరుపుదాడులు చేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి పోస్టాఫీసుల్లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో పోస్టాఫీసుల్లోని సేవింగ్స్ ఖాతాల్లో నల్లధనం భారీగా డిపాజిట్ అయిందని సీబీఐ సమాచారం. ఈ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.