: పెద్దనోట్ల రద్దుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పెద్దనోట్ల రద్దుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. పెద్దనోట్ల రద్దుపై ప్రశ్నించేవారిని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని అన్నారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని దేశంలోకి తీసుకురాలేకపోయిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలో వైట్ మనీ ఉన్న ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో 2 శాతం జీడీపీ తగ్గుతుందని అన్నారు.