: కోతిని హింసించి చంపిన‌ సీఎంసీ కాలేజీ విద్యార్థులు.. మండిప‌డ్డ త్రిష‌, రాధిక‌


క‌ళాశాల ప్రాంగ‌ణంలోకి వ‌చ్చిన ఓ కోతిని ప‌ట్టుకున్న ప‌లువురు యువ‌కులు దాన్ని చిత్ర‌హింస‌లు పెట్టి చంపేశారు. భ‌విష్య‌త్తులో స్టెత‌స్కోపు ప‌ట్టుకొని సేవ‌లు అందిస్తూ మ‌నుషుల ప్రాణాలు కాపాడాల్సిన విద్యార్థులే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డం ప‌ట్ల జంతు ప్రేమికులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలలో నలుగురు విద్యార్థులు క్యాంప‌స్‌లోకి వ‌చ్చిన‌ ఓ కోతిని దుప్పటితో కప్పి ప‌ట్టుకున్నారు. దాని చేతులు కట్టేసి ఇతర విద్యార్థుల ముందే బెల్టులు, కట్టెలతో కొట్టి చిత్రహింస‌లు పెట్టారు. ఓ ఇనుపచువ్వని దాని శరీరంలోకి దూర్చి క‌ర్క‌శ‌త్వం ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం ఆ కోతి క‌ళేబ‌రాన్ని వ‌స‌తిగృహానికి సమీపంలోనే గుంత తవ్వి పాతి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అక్క‌డి జంతు సంక్షేమ కార్యకర్త శ్రావణ్‌ కృష్ణన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నలుగురు వైద్య విద్యార్థులను తీసుకువెళ్ళి, పోలీసులు కోతి కళేబరాన్ని బయటకు తీశారు. ఆ నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం వ‌స‌తి గృహ‌ జనరల్‌ సెక్రెటరీతో పాటు ఈ నలుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న సినీ నటీమ‌ణులు రాధిక, త్రిష ట్విట్టర్ లో మెడికోల దుశ్చ‌ర్య ప‌ట్ల మండిప‌డ్డారు. భవిష్యత్తులో డాక్ట‌ర్ వృత్తి చేప‌ట్టి, ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాల్సిన వారే ఇలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డ‌డం త‌మ‌కు చాలా బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News