: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను చితకబాదిన భార్య


వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య చితకబాదిన సంఘటన మహబూబ్ నగర్ లోని రాయిగడ్డ వీధిలో జరిగింది. తిరుపతయ్య, లక్ష్మీ దంపతులకు పదిహేడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు,కూతురు ఉన్నారు. గత మూడేళ్లుగా తిరుపతయ్య పక్కదారి పట్టాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ, మంచి మాటలు చెప్పి తన భర్తను మార్చుకోవాలని చూసింది. అయితే, భార్య మాటలను పట్టించుకోని తిరుపతయ్య అదే మార్గంలో నడుస్తున్నాడు. దీంతో, విసిగిపోయిన లక్ష్మీ, ఆ మహిళతో తిరుపతయ్య కలిసి ఉన్న సమయంలో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తిరుపతయ్యను, ఆ మహిళను లక్ష్మీ, ఆమె బంధువులు చితకబాదారు. వీళ్లిద్దరినీ పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News