: పెళ్లి ప‌త్రిక‌ల‌తో పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో యువ‌రాజ్ సింగ్‌.. మోదీకి ఆహ్వానం


టీమిండియా ఆట‌గాడు యువరాజ్ సింగ్, హాలీవుడ్ నటి హజల్కీచ్ల పెళ్లి వేడుక‌కు ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డింది. త‌న పెళ్లికి హాజ‌రు కావాలంటూ అతిథుల‌ను ఆహ్వానించే ప‌నిలో ఉన్నాడు యువీ. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి త‌న పెళ్లి ప‌త్రికను అందించ‌డానికి ఈ రోజు తల్లి షబ్నం సింగ్తో కలిసి పార్లమెంట్కు వెళ్లాడు. మోదీని కలిసిన అనంతరం ఆయ‌న ప‌లువురు కేంద్ర మంత్రుల‌ని కూడా త‌న వివాహానికి ఆహ్వానించ‌నున్నట్లు తెలుస్తోంది. హజల్కీచ్లతో యువీ ఏడాది నుంచీ ప్రేమ‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి వివాహ‌వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. హజల్ కీచ్ది హిందూ సాంప్రదాయం కావడంతో వీరిపెళ్లి గుర్ ద్వారా సాంప్రదాయంతో పాటు హిందూ సాంప్రదాయంలోనూ జరగనుంది. వీరిద్దరికీ ఈ నెల 30వ తేదీన చండీగ‌ఢ్ లో గురుద్వారా సాంప్రదాయంలో వివాహం జ‌ర‌గ‌నుంది. త‌రువాత వ‌చ్చేనెల 2న గోవాలో హిందూ సాంప్రదాయంలో మరో వివాహ వేడుకను నిర్వ‌హించ‌నున్నారు. ఇక పెళ్లి విందు, ఇతర వేడుక‌లు వ‌చ్చేనెల 5న ఢిల్లీలో, త‌రువాత 7న‌ చతర్పూర్లోని ఫామ్ హౌస్లో జ‌ర‌గ‌నున్నాయి.

  • Loading...

More Telugu News