: 'చిచ్చా.. జర పాన్ మానేయ్' అని మంత్రి పద్మారావుకు కేటీఆర్ సలహా
టీఆర్ఎస్ నేత పద్మారావుకు మంత్రి కేటీఆర్ ఓ విలువైన సలహా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నమోదైన కేసుల్లో భాగంగా కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఓ ఆసక్తికర ఘటన జరిగింది. పద్మారావు పాన్ నములుతుండటాన్ని చూసిన కేటీఆర్, "చిచ్చా.. జర పాన్, జర్ధాలు తినడం మానేయ్" అని సలహా ఇచ్చారు. ఆ వెంటనే "రామ్ (కేటీఆర్ ను పద్మారావు అలానే పిలుస్తారట) నీకు ఏ అలవాటు లేకనే గదా? నన్ను పాన్ మానేయ్ అంటావ్. నువ్వీ చాక్లెట్లు తిను" అంటూ కేటీఆర్ కు కొన్ని చాక్లెట్లు ఇవ్వబోయారు. దీంతో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సహా అందరిలో నవ్వులు వెలిశాయి.