: బంగారం, వెండి, క్రూడాయిల్ ధరల పతనం
గురువారం నాడు బులియన్, క్రూడాయిల్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో ట్రేడర్లు, ఆభరణాల తయారీదారులు విలువైన లోహాలను విక్రయించేందుకే మొగ్గు చూపారు. దీంతో బంగారం ధర పది గ్రాములకు (డిసెంబర్ 5 డెలివరీ) క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 147 తగ్గి 0.51 శాతం నష్టంతో రూ. 28,682కు, వెండి ధర కిలోకు రూ. 358 పడిపోయి, 0.88 శాతం నష్టంతో రూ. 40,168కి చేరాయి. ఇదే సమయంలో క్రూడాయిల్ ధర బ్యారల్ కు 0.30 శాతం తగ్గి రూ. 3,308 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు సమీప భవిష్యత్తులో మరింత ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.