: రాజ్యసభలో విపక్ష నేతల ప్రసంగాన్ని చిరునవ్వు చిందిస్తూ వింటున్న ప్రధాని మోదీ
రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై విపక్షపార్టీ నేతలు చేస్తోన్న విమర్శలకు సమాధానం చెప్పడానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారు చేస్తోన్న విమర్శలని చిరునవ్వులు చిందిస్తూ వింటున్నారు. రాజ్యసభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పెద్దనోట్ల రద్దుపై ప్రసంగించిన అనంతరం సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ప్రసంగిస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, నల్లధనం ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ రోజు మోదీ సభలో ఉన్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఇతర విపక్ష నేతలు ప్రసంగిస్తున్నారు. వారి విమర్శలన్నింటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న మోదీ.. వారు చెబుతున్న అంశాల్ని ఎంతో శ్రద్ధగా, అప్పుడప్పుడు చిరునవ్వులు చిందిస్తూ వింటున్నారు.