: మీడియా ద్వారా అంతా బాగుందని ప్రచారం చేసుకుంటున్నారు!: రాజ్యసభలో ప్రభుత్వంపై ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ విమర్శలు
రాజ్యసభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పెద్దనోట్ల రద్దుపై ప్రసంగించిన తరువాత సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పెద్దనోట్ల రద్దుతో ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మీడియా ద్వారా అంతా బాగుందని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో నల్లధనం ఎంత ఉందో, ఎంత మంది దగ్గర ఉందో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల వద్ద క్యూల్లో ఎవరయినా నల్ల కుబేరులు ఉంటున్నారా? అని ప్రశ్నించారు. కొంత మంది నల్లకుబేరుల కోసం రైతులను, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని సూచించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం ఎప్పుడు తీసుకొస్తారో వెల్లడించాలని అన్నారు.