: హైద‌రాబాద్‌లో ఘనంగా కేంద్రమంత్రి దత్తాత్రేయ కుమార్తె పెళ్లి వేడుక


హైద‌రాబాద్‌ గచ్చిబౌలిలోని మినీ స్టేడియంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, జిగ్నేశ్‌ల పెళ్లి వేడుక ఈ రోజు ఉదయం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. ఈ వేడుక‌కి అతిర‌థ మ‌హార‌థులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై వధూవరులను ఆశీర్వదించారు. వారిలో లోకాయుక్త జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, సినీనటుడు చిరంజీవి, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్ర‌ముఖులు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు ఉన్నారు.

  • Loading...

More Telugu News