: రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం


గుజరాత్ లోని జామ్ గనర్ లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న ముడి చమురు శుద్ధి కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదంతో ప్లాంటులో కొనసాగుతున్న చమురు శుద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News